Surepally’s Weblog


బాల గోపాల్ నువ్వెక్కడ
అక్టోబర్ 19, 2009, 4:19 అపరాహ్నం
ప్రచురించిన వర్గము Poetry

balagopalబాల గోపాల్ నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలో
కాస్త చెప్పవా!

నువు లేకపోతే ఉద్యమాలు
బెంగపెట్టుకుంటాయనిపిస్తుంది  
సిద్దంతాలు రాద్దాంతాలు 
అర్దాంతరంగ ముగుస్తాయెమో

నిన్ను నాయకుడుగా చూద్ధామంటే  
ఎక్కడ విగ్రహాలకి, జన్మ దినాలకి
పరిమితమౌతావోనని,
 
దేవునిగ చిత్రిద్దామంటే   
నువు ఏ సిద్దాంతాలకి
పరిమితం కాలేదు కదా,
మతాలకి కట్టుబడ  లేదు కదా
కవిగా కథకుడిగా మలుద్దామంటే
కేవలం ఒక మూల కుచొని రాయలేదు

వాస్తవాలని పచ్చిగా ,నిక్కచ్చిగా చెప్పి
నిద్ర పోతున్న లోకాన్ని మేలుకొలుపుతావు

అయ్యా !
ఎక్కడని వెతకను 
ఒపెన్ కాస్ట్ తవ్వకాల్లోనా,
పొలేపల్లి పోరాటం లోనా
పోలవరం అదివాసీ గుండెల్లోనా   
అన్నల ఆర్థనాదాల్లోనా
కాలుష్యపు  కోరల్లోనా
ఆవేదనా, అర్ద్రతా, ఆలోచనా
మిళితమైన  అక్షరాల్లోనా
నీతోనె హక్కుల ఊపిరి ఆగిపోతుందా
భయంగా ఉంది ..
విప్లవాలకి అర్థాలు వెతుకుతూ
అంతులేని  దూరాలకి వెళ్ళావా 
కుచించుకు పోయిన  మనసులతో  
స్వార్దం   నిండిన మనుష్యులతో
నడిచి  నడిచి అలసి పోయావా
నువు వేసిన అడుగులలొ 
నీవెంటే నడుద్దామంటే  
గమ్యం చేరకుండానే
మాయం అయ్యావే 

ఇక్కడ కూడా
నిన్ను నువ్వు నిలబెట్టుకుందామనా
ఎవరి దారి వారే వెతుక్కోవాలని
అన్నిదార్లు
మానవ మనుగడ  వైపే అని !


No Comments Yet ఇప్పటి వఱకు
మీ ఉద్దేశ్యం…



మీ ఉద్దేశ్యం…
Line and paragraph breaks automatic, e-mail address never displayed, HTML allowed: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>