నిజమే కావొచ్చు
నీ చిరు దరహసం,
స్నెహపూరిత కరాచలనం
నన్ను మత్తులో ముంచివేయొచ్చు
ఆలొచితంగానో అనాలొచితంగానో
నువు పొరపటున గీసిన గీతల్లో
నా తెలంగాణ బొగ్గుట్టలై ఉండొచ్చు
ఎన్నో జీవితాలు రింగురొడ్డుల్లో మెలికలు తిరిగుండొచ్చు
అడవి బిడ్డలు అంతులేని ఆశలకు బలై ఉండొచ్చు
అయినా..
నీ ఒక్క ప్రాణం ముందు
అన్నీ దిగదుడుపే
నీ నవ్వు చాలు జీవితాలని అర్థంచేసుకొవడానికి 
ద్వంధ నాలుకలని, నీతిని
విప్లవ, సార్వజనీన ఆలొచలని చేధించడానికి
స్నేహ హస్తమా నీకో సలాం!

Advertisements