చావును ఆలింగనం చేసుకుంటున్న..
నులి వెచ్చని చలిమంటలా
అగ్గిని ముద్దు పెట్టుకుంటున్నారా
మాంసం ముద్దలు రాలి పడుతుంటే
జై తెలంగాణా అంటున్నారా
రైళ్ళు, బస్సులు, ఉరితాళ్ళు, పెట్రోల్, కిరోసిన్
కాదేది చావుకు అనర్హం
పుట్టెడు దుఖం తోని బతక లేక
అప్పుల ఊబిలోంచి బయటపడలేక
ఒక స్నేహ హస్తం కనిపించక
తానూ నేసిన దారాలకి
బలి అయిన నేతన్న
పత్తి చేనుకోసం తెచ్చిన మందుని
మత్తుగా సేవించి తనువూ చాలించిన రైతన్న
దేశం కాని దేశానికి
కైకిలి పోయి
కన్న వాళ్లని
కట్టుకున్నోల్లని కండ్లార చూడలేక
కాటికి పోయిన కూలన్నా
ఎందుకు ..ఎందుకు..చావెందుకు..
ఎవరు లేనికాడా..
ఎ ఆశా లేని కాడ
జాడ లేని కాడ
అబద్దాలు అరాచాకాలైతున్న కాడ
మౌనమే మారణాయుధమైతున్న కాడ
మాటలు తూటాలైతున్న కాడ
పగల్భాలు పరాష్కాలాడుతున్నా కాడ
ఎవరూ లేని కాడ ..ఏకాంతమే జాడ
అన్ని పోయిన వేళ
కళ తప్పిన నేల..
వద్దన్న! నీ కాల్మోక్తం! మట్టి కోసం కొట్లాడు
కాని మట్టిల కలవోద్దు

నిర్జీవి కావొద్దు!
ఒకటి కాదు రెండు కాదు
నాలుగు కోట్లు నీ తాన
వొంటరివేప్పుడు కాదు..
ఒక్క సారి సూడు..
నీ సుట్టే మేమంతా సుడిలెక్ఖ !
వొట్టి కుండ కాదు తెలంగాణా
నిండా నూరేళ్ళ కుండ
బతుకు నిండా!

జై తెలంగాణా..
సుజాత సూరేపల్లి

(3rd Feb, 2013, FB)

Advertisements