ఇదొక విచివూతమైన సందర్భం. హింస-అహింసల మధ్య మీమాంసపజాస్వామ్యం-అవూపజాస్వామ్యం మధ్య కొట్టొచ్చినట్టు కనపడుతున్న సరిహద్దు.నీతి-అవినీతి మధ్య ఏదో తట్టుకున్న భావన. సమానత్వం-అసమానత్వ అర్థాల వెతుకులాట. ఏమైతుంది ఈపవిత్ర భారతదేశంలో? ఏమైతుంది ఈ అర్థం కాని రాజకీయాలలో? ఎవరు చెప్పినరు ప్రజలే ప్రభుత్వాలను నడిపిస్తారని? తెలంగాణ చరిత్ర ఏమి చెపుతుంది? ఉద్యమం వెయ్యి చావులతో వర్ధిల్లుతున్నది! కొండంత ఆశతో తల్లితంవూడులు పెట్టుకున్న ఆశలకంటే ఎందుకు తెలంగాణ ఉద్యమం ప్రాణం కంటే ఎక్కువైంది పాలమూరు దినేష్‌కి, కరీంనగర్ నర్సింగ్‌కి? ఇద్దరు చిన్నపిల్లల్ని ,భార్యను వదిలేసి రైలు కిందపడి చావాలన్న బలమైన కోరిక మంచిర్యాల శేఖర్‌కి ఎందుకు కలిగింది? అందరి వార్తలు రాసే జర్నలిస్ట్ బోనగిరి రాములు బస్సుకు ఎదురుపోయి మరి గుద్దుకుని ఎందుకు సచ్చిండు?

మాటలతోని తెలంగాణరాదు. రాజీనామాలతో ని తెలంగాణ అంతకన్నా రాదు. ఎన్నికల జాతరొస్తే తాగనీకి, తిననీకి గింత దొరుకుతుంది కాని తెలంగాణ రాదు. తీరొక్క పోరాటాలతోని రాకపాయే, ఏం చేస్తే తెలంగానొస్తది? ఎవడు పెట్టిండు 28తేదీ మీ తద్దినానికి ముహూర్తం? బడుగు, బలహీన, కార్మిక వర్గాల భుజాల మీద తుపాకిపెట్టి సాధించుకున్న ఈతేది ఏమి తెచ్చింది? మంత్రులందరూ శుష్టిగా శత్రువుల ఇండ్లల్ల భోజనాలు చేసి వారు కొనిచ్చిన విమానపు టిక్కెట్లు కొనుక్కొని ఢిల్లీకి పోయి జై తెలంగాణ అంటే అమాయకంగా నమ్మిన జనాలకు చావోచ్చింది! ఇదీ చుక్క రక్తం కారకుండా జరుగుతున్న శాంతియుత ఉద్యమం! అక్కా! ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎవరి ఆస్తిని కొల్లగొట్టకుండా,ఎవడికి చీమ కుట్టినట్టు కూడా తెలవకుండా జరిగే ఆపరేషన్. గ్రీన్‌హంట్‌కాదు. సూసైడ్ హంట్. యాదయ్య ఎన్‌సీసీ గేట్ ముందు కాలి బూడిద అయితే, శ్రీకాంతచారి చర్మం రాలి పడుతున్నా జై తెలంగాణ అంటే, ఇషాన్‌డ్డి , వేణుగోపాల్‌డ్డి మూడో కంటికి తెలువకుండా మూగపోతే హింస కాదు! జై తెలంగాణ అని నాలుగు పుష్పగుచ్చాలు, శవయాత్రలు జరిపించి వాడిని వీడు తిట్టి, వీడిని వాడు తిట్టి, శవాల మీద ప్రమాణాలు చేసి జై తెలంగాణ అని ఎలుగెత్తి చాటి, వీరులారా వందనం అని పరవశించి పాడుకుంటే అది ప్రజాస్వామ్య ఉద్యమం! ఇన్ని ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యమం ప్రపంచంల ఎక్కడన్నా ఉందా? అది కూడా భూమి కోసం, ప్రాంత విముక్తి కోసం.

మేధావులు ఇక్కడ కులాల కుంపట్లు పుట్టిస్తరు. తెలంగాణ ఎందుకురో బహుజనుల రాజ్యంకావాలి ఆంటడు ఎ దళితవాది. వీరి ఉద్దేశం తెలంగాణలో బహుజనులు ఉండరు.పదిశాతం ఉన్న అగ్రకులాలు మాత్రమే ఉంటారు. వీరి దృష్టిలో కింది కులాలకు ఎప్పుడూ తెలివి ఉండదు. అందులో ఇంగ్లిష్ మాట్లాడకపొతే అసలు రాదు. ఇది ఇంగ్లిష్‌లో చెపితేనే అర్థం అవుతుంది! ఇంకా కొంతమంది ఉద్య మకారులు అడ్డామీద కూలోల్ల కంటే అధ్వాన్నం.ఎవడు పిలిచినా, వాడు ఏ ప్రాంతంవాడు అయినా, ఏ పార్టీవాడు అయినా, వాడు చేయబట్టి ఎన్ని ప్రాణాలు పోయినా తెలంగాణకి వ్యతిరేకంగా పని చేస్తరు. వినయ విధేయతలతో. అవును నేను చెప్పినకదా తెలంగాణరాదనీ! ఒక చిలుక జోష్యం! ఈ జోష్యాలకి మల్లొక ప్రాణం బలి! సచ్చినోడు కింది కులం వాడైతే ఇంకా పండగ. ఇది దొరల తెలంగాణ అని దుమ్మెత్తి పోసి ఇంకాస్త సొమ్ము చేసుకుంటాడు. నా జోష్యం ఫలించింద ని ఆనందపడతాడు. తెలంగాణ తిండి తింటూ గాలి పీలుస్తూ, ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాజకీయాలను అర్థం చేయించకుండా నాలుగు బండరాళ్ళను నెత్తిన మోపి నేను చెప్పిన కదా, తెలంగాణ రాదంటే రాదని తన కలుగులోకి పోతాడు. మల్లి బేరం వచ్చిందాకా కనపడడు. నిజాలను, విమర్శను అర్థం చేసుకోకుండా మా మీదే ప్రేలాపనా అని గింజుకునే వారు కూడా ఉంటరు. అది సహజం. ప్రతివాడు నా జ్యోతిష్యమే కరెక్ట్ అంటడు. లేదంటే వారి వారి దుకాణాలు నడవవు కదా! క్షమించున్రి అన్నల్లారా,అక్కల్లారా, మేధావుల్లారా! మీ తెలివితేటలు ఏవి మా బిడ్డలని కాపాడలేవు. ఒక పక్క ఉవ్వెత్తున ఉద్యమం లేచిపడుతుంటే కేవలం అమ్ముడు పోయేవాడిని బూచిగా చూపించి ప్రాణం కంటే ఎక్కువ ఉద్యమంలో మమేకమైన వాడిని అవమానిస్తుంటే భరించలేకే ఈ కోపం, బాధ! పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలను చూసుకుంట మౌనంగానే ఉందామా? ఒకటి తరువాత రెండు అని లెక్కలు కట్టుకుందామా? ఈప్రాంతం విముక్తి అయితే ఆ నలుగురికి తప్ప ఇంకెవడికి లాభంలేదా? ఈ మౌనంకాదా ఇన్ని ప్రాణాలు తీసింది? ఈ అష్ట వంకరల విధానాలు వెయ్యి కుంపట్లే కదా పచ్చని జీవితాలలో చిచ్చుపెట్టింది?

అవును ఇక్కడ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నది! శవాల గుట్టలను పేర్చుకుంటూ, నిచ్చెన మెట్లలాగా ఎక్కుతూ, పైపైకి ఎదుగుతున్నది. ఈ ఉద్యమ గమనాన్ని మనం మార్చము, చచ్చేవాడికి భరోసా ఇవ్వని ఉద్యమం, గాడి తప్పుతున్న ప్రజాస్వామ్యాన్ని దారిలో పెట్టని ఉద్యమం, మాటలతోని, మౌనాలతోని ప్రాణాలను తీస్తున్న ఉద్యమం గురించి మాట్లాడితే అపవాదు, అవమానం. అటు రాజకీయాలు, ఓట్ల రాజకీయాలను ఎన్నిసార్లు నమ్ముదాం. ప్రాంతం కోసం సమైక్యం గా, సామూహికంగా రాజీనామాలను చేస్తున్న వారితో రాజీనామాల ఆలోచననే భరించలేని వారితో ఇక్కడ పోటీ నడుస్తుంది. ఎందరు చచ్చినా మా పదవులు పదిలం అనే వాడిని మార్చలేం. రాబోయే ఎన్నికల్లో కీలక పదవులపై దస్తీలు వేసి, కలలుకంటున్న వారిని ఏమన్నా ఎనిమిదవ చాప్టర్ అమలులోకి వస్తుంది. వారి గురించి పల్లెత్తుమాట అనకూడదు. నల్లబాడ్జీలతోని నిరసన, అది కూడా మధ్యాన్న భోజన సమయంలో, ఇదే భరోసా. ఈ భరోసా నర్సింగ్‌కి, శేఖర్‌కి, రాములుకి, మల్లేష్‌కి సరిపోలేదు.ఇటు ఉద్యమం మౌనంగా ఉంటుంది. ప్రాణాలైనా అర్పిస్తాం తెలంగాణ సాధిస్తామన్న నినాదాలు మూగపోతాయి.జాక్‌ను పెట్టిన జానాడ్డి ఉగాండాకి పోయి అక్కడ పంచాయతీ పరిస్థితుల్ని చూసి వస్తాడు. 2014 ఎన్నికలలో గెలుస్తామని అమ్మకి భరోసా ఇస్తాడు. ఎన్నో కష్టాలు నష్టాల కోర్చి, ప్రాణాలు లెక్కచేయకుండా మార్చ్‌లు చేసి, దీక్షలు చేస్తే మిగిలేది హామీలేని వాగ్దానాలు, కనీసం శత్రువుని భయపెట్టని నినాదాలు! రేపు వీరికి కోపం వస్తుంది. వెంటనే తెలంగాణ కండువా కప్పుకుంటారు. మనం మైమరిచి పోయి మల్లి గెలిపిస్తాం! ఈదేశంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉండదు. అమ్మకి చావు కబుర్లు చెప్పదు.ఎన్‌కౌంటర్లు అంటే తెలియని, రక్తాన్ని ఎన్న డూ కండ్ల చూడని గవర్నర్ ఇచ్చే నివేదిక పై తెలంగాణ ఇవ్వాలా, వద్దా అన్న నిర్ణయం తీసుకుంటారు ఢిల్లీ పెద్దలు. డబ్బు మూటలు కట్టుకుని కేవీపీలు రచిస్తున్న రహస్య కథనానికి మాత్రమే విలువ ఉంటుంది.

ఇది ఫ్రెంచ్ విప్లవం అయితే ఆత్మహత్యలు ఎందుకున్నట్టు? ఓడిపోయిన ప్రజాస్వామ్యాన్ని మార్చడానికి ప్రజల ఆకాంక్షలు తెలపడానికి, హక్కులు సాధించుకోవడానికి ఉద్యమాలు నడుస్తాయి. ఈ క్రమంలో యుద్ధం నడవాలి. శత్రువు ఎవడో స్పష్టంగా తెలవాలి. వాడి వ్యూహ ప్రతివ్యూహాలు పసిగట్టగలగాలి. ఎత్తు కు పైఎత్తులు వేయాలి. లేదంటే శాంతిలో అశాంతి, ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యం, హింసలో ఆహింస ప్రజల సొంతం అయితుంది. ఒకవైపు ఉద్యమం భరోసా ఇవ్వకపోగా, మరొక వైపు ఎన్నికల వరకూ లాక్కొచ్చే పార్టీలు, డబ్బు మూటల రాజకీయాలు రంజుగా నడుస్తున్నాయి. ఉద్యమంలో పాల్గొనే వారికి, ఉద్యమాన్నే ఊపిరిగా అనుభవించి జీవిస్తున్న వారికి, ఏదో జరుగుతుందని, ఎవరో వస్తారని, ఇస్తారని, తెస్తారని ఎదురు చూస్తున్న అమాయక చక్రవర్తులకు మిగిలేది, నిరాశ నిస్పృహలే. ఆత్మహత్యలే. ఈ దీనత్వం ఇన్ని ఉద్యమాలు జరిగిన తెలంగాణలో ఎన్నడన్న ఉన్నాయా? జగిత్యాల జైత్రయావూతలు, జనసభలు మల్లి రావా? ఒక వేల వస్తే ఇంతకన్నా ఎక్కువ ప్రాణాలు పోతాయా? ఇంతకన్నా ఎక్కువ కేసు లు అయితయా? కనీసం ఆ చావులను అమర వీరుల చావులని అన్నా భవిష్యత్తు తరాల వారికి మిగులుతాయి కదా! ఎన్ని చావులు చచ్చినా కదలని, మెదలని వారు ఇప్పుడు ఎన్నికల కోసం, యువరాజ పట్టాభిషేకం కోసం, అమ్మ వారి కలలు, కోరికల పంటకు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అది మన విజయంగా భావించక్కర్లేదు. ఈ దుఃఖాన్ని అందరం పంచుకుందాం రాండ్రి! లేదా ప్రజాస్వామ్యాన్ని మారుద్దాం! అది కేవలం పటిష్టమైన ఉద్యమంతోనే సాధ్యం!

-సుజాత సూరేపల్లి
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యద

Namasthe telangana

4/2/2013

Advertisements