పుష్కర ముష్కరులు

అన్యాయం అరవై పాదాల మధ్య
నడుస్తున్న కాలం లో
పుష్కర స్నానం
తిలా పాపం
తలా పిడికెడు

మద్యం మత్తులో పాపాలు
మతం మత్తులో పుణ్యాలు
రెంటికి మధ్య ఉన్నాయా ఏమైనా తేడాలు ?

ఇక్కడ జీవితం ఒక పెద్ద మార్కెట్
నమ్మకాలు సెంటిమెంట్ లు
కులము మతము అన్ని సరుకులే
ని పాపాలు ఒక పెద్ద పెట్టుబడే

చుట్టు జరుగుతున్న నేరాలని
నావి కావని మానవత్వాన్ని దులిపేసుకుని
చేసిన పాపాలు పూర్తిగా కడిగేసుకుని
గోదారిని మురికిలో ముంచెత్తే కాలం
నీ పవిత్ర స్నానం
నాయకులకి జీవనాధారం

ని పాప భీతి కి
పుణ్య స్వార్ధానికి
ఒక రేటుంది బ్రదర్
ఇదొక పెట్టుబడి లేని వ్యాపారం

జీవనాధారమైన గాలి భూమి నిరు
విశ్వ విపణిలో అమ్మబడుతున్నా
జాతులనీ సమూలంగా
చీల్చి చండాదబడుతున్నా
స్త్రీలు బహిరంగంగా వేలం వేయబడుతున్నా
చెరచ బడుతున్నా
అంగాంగం నరకబడుతున్నా
కులం పేరుతో జీవితాలను
కూల్చివేస్తున్నా
మతం పేరుతో హతమారుస్తున్నా
అమాయక జనాహహకారాల ఆర్తనాదాలు
వేద పండితుల మంత్రోచ్చారణలో మటు మాయం

ఇపుడు పాపాలను కడిగేసుకో
మల్లి పన్నెండు సంవత్సరాల వరకు
ఫ్రెష్ గా కొత్త పాపాలకు తేర తియ్
నిర్భయంగా పాపాల కూపం లో కూరుకుపో
ని మౌనమే ఒక పాపం
ఖచ్చితంగా కావాలి నీకు పుష్కర స్నానం

ఇది పుష్కర ముష్కరుల కాలం
మల్లి పుష్కరాలకి
గోదారమ్మ తల్లి ఎ రేటు పలుకునో
ఉండునో పోవునో కూడ తెలియని కాలం
ఇది అమాయక మూర్ఖుల ముష్కరుల కాలం

Advertisements